Prasad Shrikant Purohit:17 ఏళ్ల కిందటి కేసు..8ఏళ్ల జైలు శిక్ష తర్వాత..కల్నల్ గా పదోన్నతి

Prasad Shrikant Purohit:17 ఏళ్ల కిందటి కేసు..8ఏళ్ల జైలు శిక్ష తర్వాత..కల్నల్ గా పదోన్నతి

మాలేగావ్​ పేలుళ్ల కేసులో నిర్దోషిగా బయటికొచ్చిన ప్రసాద్​ శ్రీకాంత్​పురోహిత్ తిరిగి కల్నల్ గా పదోన్నతి పొందారు. 2008లో జరిగిన మాలేగావ్​ పేలుళ్లు కేసులో ప్రసాద్​ శ్రీకాంత్​ పురోహిత్​ పై అభియోగాలు ప్రాసిక్యూషన్​ నిరూపించలేపోవడంతో ముంబైకోర్టు ఆయనను, మరో ఆరుగురు నిందితులను నిర్ధోషులుగా తీర్పు నిచ్చింది. ప్రసాద్​పురోహిత్​ నిర్దోషిగా విడుదలైన తర్వాత తాజాగా ఆయనను కల్నల్​ హోదా పదోన్నతి కల్పించారు. 

2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు..

సెప్టెంబర్​ 29,2008లో ముంబైకి సమీపంలోని మాలేగావ్​లో ఓ మసీదులో మోటార్​బైక్​ కు అమర్చిన బాంబు పేలి ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. 101మంది గాయపడ్డారు.ఈ పేలుళ్లకు సంబంధించిన 14మందిని అరెస్ట్​ చేశారు. వీరిలో ప్రసాద్​ శ్రీకాంత్​ పురోహిత్ కూడా ఉన్నారు. 

ఈ కేసులో పురోహిత్​ కు 8ఏళ్ల జైలు శిక్ష పడింది. 17ఏళ్ల కిందటి కేసులో  14మందిలో ఏడుగురిని విచారించిన ముంబై కోర్టు.. 2025 జూలై 14న వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. విడుదల అయిన నిందితుల్లో రిటైర్డ్ మేజర్ రమేష్​ ఉపాధ్యాయ, సుధాకర్​ చతుర్వేది, అజయ్​ రహిర్కర్​,సుదాంకర్​ ధర ద్వివేది, సమీర్ కులకర్ణి ఉన్నారు. 

►ALSO READ | ఇండియా మహా అద్భుతం చేసింది : రైలు బోగీ లాంటి లాంఛర్ నుంచి అగ్ని క్షిపణి ప్రయోగం సక్సెస్

పురోహిత్​ పదోన్నతిపై  కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్ అభినందనలు తెలిపారు. పురోహిత్ గొప్ప దేశభక్తుడంటూ ప్రశంసించారు. ధైర్యంగా దేశానికి సేవ చేసే దేశభక్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అని గిరిరాజ్​ సింగ్​ X లో పోస్ట్ చేశారు.​