కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఝలక్

కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఝలక్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఝలక్ ఇచ్చారు . 2024 ఎన్నికల్లో విజయం కోసం పార్టీ ఏర్పాటు చేసిన ఎంపవర్డ్‌ యాక్షన్‌ గ్రూప్‌ 2024లో చేరేందుకు ఆయన నిరాకరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం ప్రశాంత కిషోర్‌ ఇచ్చిన ప్రజంటేషన్‌, విడతల వారీగా జరిగిన చర్చల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎంపవర్డ్‌ యాక్షన్‌ గ్రూప్‌ 2024ని ఏర్పాటు చేశారు. 

ఈ గ్రూప్‌ లో  చేరాల్సిందిగా సోనియా, రాహుల్ గాంధీలు ప్రశాంత్‌ కిషోర్‌కు ఆఫర్ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి కొన్ని బాధ్యతలు కూడా అప్పజెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే గ్రూప్‌లో చేరేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ నిరాకరించారన్న వార్తలు లీక్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్ స్వయంగా స్పందించి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని నిరాకరించినట్లు ప్రకటించారు.

ఈఏజీలో భాగంగా పార్టీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ ఉదారమైన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాను. ప్రస్తుతం పార్టీకి నాకన్నా నాయకత్వం, కలిసికట్టుగా నిర్మాణాత్మక సమస్యలపై దృష్టి సారించి సమిష్టి సంకల్పంతో అంతర్గత సమస్యలు పరిష్కరించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.

ప్రశాంత్ కిశోర్ ప్రకటనకు ముందు ట్వీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా పీకేపై ప్రశంసల జల్లు కురిపించారు. పార్టీ కోసం ప్రశాంత్‌ కిషోర్‌ విలువైన సలహాలు ఇచ్చారని, దీనికి  కాంగ్రెస్‌ పార్టీ ప్రశాంత్ కిశోర్ను అభినందిస్తున్నామని చెప్పారు.

 

 

ఇవి కూడా చదవండి

మెఘా కేసులో ఇంజెంక్షన్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్ట్

6 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్

ఈనెల 29వరకు జైలులోనే నవనీత్ కౌర్ దంపతులు

డ్యాన్స్ స్టెప్పులతో అంకుల్ హల్ చల్