6 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్

6 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్
  • కొవాగ్జిన్, కార్బెవాక్స్ లకు అనుమతిచ్చిన డీజీసీఐ

న్యూఢిల్లీ: మళ్లీ కరోనా విస్తరణ మొదలైందన్న సంకేతాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు టీకా ఇచ్చేందుకు అనుమతించింది డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆరు నుంచి 12 ఏళ్ల వయసు వారికి భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతిచ్చింది డీసీజీఐ. దేశంలో 12 ఏళ్లు పైబడిన పిల్లల కోసం ప్రస్తుతం రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. 12 నుంచి 14 ఏళ్ల వారికి బయోలాజికల్-ఇ తయారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఇవి ప్రభుత్వ కేంద్రాల్లోనే అందుబాటులో ఉన్నాయి. మరోవైపు 15 నుంచి 18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ టీకా ఇస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మెఘా కేసులో ఇంజెంక్షన్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్ట్

ఈనెల 29వరకు జైలులోనే నవనీత్ కౌర్ దంపతులు

డ్యాన్స్ స్టెప్పులతో అంకుల్ హల్ చల్