మెఘా కేసులో ఇంజెంక్షన్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్ట్

మెఘా కేసులో ఇంజెంక్షన్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్ట్

కాంట్రాక్ట్ సంస్థ మేఘా కంపెనీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఖమ్మం జిల్లా కోర్టు ఇచ్చిన ఇంజెంక్షన్ ఆర్డర్ ని సస్పెండ్ చేసింది హైకోర్టు. మేఘా కంపెనీపై ఎట్లాంటి కథనాలు వేయకుండా ఆంక్షలు విధిస్తూ ఆ కంపెనీ కోర్టు నుంచి మధ్యంతర ఇంజెంక్షన్ ఆర్డర్ తీసుకుంది. వీ6 వెలుగు సహా 30 జాతీయ పత్రికలు, వెబ్ సైట్స్ పై మేఘా ఈ ఆదేశాల్ని ఖమ్మం కోర్టు నుంచి తెచ్చుకుంది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో V6 వెలుగు పిటిషన్ దాఖలు చేసింది. ఇంజెక్షన్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని హైకోర్టులో సీనియర్ అడ్వొకేట్ ఆర్కాట్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. పూర్తి సెన్సార్ లాంటి ఆదేశాలతో మీడియా సంస్థలు మూతపడతాయని కోర్టుకు విన్నవించారు. V6 వెలుగు వాదనను సమర్థించిన హైకోర్టు బెంచ్.. మేఘా తెచ్చుకున్న ఇంజెంక్షన్ ఆర్డర్ ను సస్పెండ్ చేసింది. మేఘా వాదనను జిల్లా కోర్టులో చెప్పుకోవాలని ఆర్డరిచ్చింది.

కాంట్రాక్ట్ కంపెనీ మెఘా ఇంజినీరింగ్ పై మీడియాలో కథనాలు రాయద్దంటూ మొదట్లో ఖమ్మం జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర, జాతీయ వార్తా పత్రికలతో పాటు వెబ్ సైట్లు, గూగుల్, ట్విట్టర్ లాంటి సోషల్ ప్లాట్ ఫాంలలో మేఘా కంపెనీపై ఎట్లాంటి కథనాలు వేయకుండా ఆంక్షలు విధిస్తూ ఆ కంపెనీ కోర్టు నుంచి మధ్యంతర ఇంజెంక్షన్ ఆర్డర్ తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ మీడియా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ V6-వెలుగు తరపున ప్రముఖ అడ్వొకేట్ చంద్రశేఖర్ కౌంటర్ ఫైల్ చేశారు. 

రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు మధ్యంతర ఇంజెంక్షన్ భంగం కలిగించేలా ఉందనీ, ఈ ఆర్డర్ ను ఎత్తేయాలని ఖమ్మం కోర్టులోనూ వాదనలు వినిపించారు. ఈ ఆదేశాలతో మీడియా స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితి ఉంటుందని కోర్టు దృష్టికి తెచ్చారు. మీడియా స్వేచ్ఛ కేసులపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు స్పష్టంగా ఉన్నాయని వివరించారు. తమ వాదనలను కోర్టు రికార్డు చేసిందని అడ్వొకేట్ చంద్రశేఖర్ తెలిపారు. 

ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి బిడ్డ పెండ్లికి కాంట్రాక్ట్ కంపెనీ మెఘా చెల్లింపులపై ఆరోపణలొచ్చాయి. వీటిపై కంపెనీ వివరణతో పాటు ఉన్నదున్నట్లుగా V6-వెలుగులో కథనాలొచ్చాయి. జర్నలిజం విలువలతో కథనాలు రాసినా గొంతునొక్కే ప్రయత్నాలు జరిగాయి. తాజా ఆదేశాలతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను పటాపంచలు చేసింది హైకోర్టు. 

 

 

ఇవి కూడా చదవండి

6 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్

ఈనెల 29వరకు జైలులోనే నవనీత్ కౌర్ దంపతులు

శ్రీ రామనవమి ‘అల్లర్ల’ పిటిషన్ పై సుప్రీంకోర్టు అసహనం