బీజేపీని ఓడించడానికి ఐదు నెలలు సరిపోవు

V6 Velugu Posted on Jan 24, 2022

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించాలంటే ఐదు నెలల సమయం సరిపోదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. 2024లో జరగబోయే లోక్ సభ ఎలక్షన్లలో బీజేపీని ఓడించొచ్చన్నారు. కానీ ఇప్పుడు బీజేపీని ఓడించే సత్తా ప్రస్తుత ప్రతిపక్షానికి లేదన్నారు. ప్రతిపక్ష బలాన్ని పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నానని ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పీకే చెప్పారు. 

'2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమే. కానీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీకి బీజేపీపై గెలిచే సత్తా లేదనే చెప్పాలి. అయినా సరే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ధీటైన పోటీ ఇచ్చేందుకు ప్రతిపక్ష ఫ్రంట్ కు అవసరమైన సాయం అందిస్తున్నా. హిందూత్వ, జాతీయవాదం, సంక్షేమ పథకాల అమలు బీజేపీ గెలుపునకు దోహం చేస్తాయి. వీటిలో ఏ రెండింటినైనా అపోజిషన్ పార్టీలు ధీటుగా ఎదుర్కోవాలి' అని పీకే పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

టెర్రరిస్టుకు ఎదురు నిలిచిన వీర బాలిక హిమ ప్రియ

తల్లి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లక్షన్నరకు ఫర్నీచర్ ఆర్డర్

ఆటో డ్రైవర్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

Tagged Bjp, lok sabha Elections, Opposition Parties, 2024 elections, Prashanth Kishor

Latest Videos

Subscribe Now

More News