ఎమ్మెల్యేలపై పబ్లిక్​ ఏమనుకుంటున్నరని ఆరా

ఎమ్మెల్యేలపై పబ్లిక్​ ఏమనుకుంటున్నరని ఆరా
  • 40 శాతం మందిపై వ్యతిరేకత ఉన్నట్టుగా లీకులు
  • ముగ్గురి పేర్లతో షార్ట్​లిస్ట్ తయారు చేసే పనిలో పీకే టీమ్​
  • తమ పరిస్థితి ఏమిటోనని హైరానా పడుతున్న నేతలు

హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రశాంత్​కిషోర్ టెన్షన్ పట్టుకుంది. పీకే సర్వేల ఫీడ్‌‌బ్యాక్‌‌తో తమ సీటు ఉంటుందా.. ఊడుతుందా.. అనే భయం మొదలైంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు​టీఆర్ఎస్ అధినేత కేసీఆర్  ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బీహార్‌‌కు చెందిన ప్రశాంత్ కిషోర్‌‌ను తన స్ట్రాటజిస్ట్‌‌గా తెచ్చుకున్నారు. ఎన్నికల వరకు రాష్ట్రంలో తమ పార్టీ తరఫున పని చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కేసీఆర్‌‌కు అవసరమైన ఫీడ్​బ్యాక్ అందించటంతో పాటు అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల వరకు వివిధ దశల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత్ కిషోర్ టీమ్ ప్రత్యేకంగా పని చేయనున్నట్లు క్యాడర్​ చెబుతున్నది. పీకేతో పాటు ఆయన టీమ్ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పీకే ఉమ్మడి మెదక్‌‌, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో తిరిగి వచ్చి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌‌లో పార్టీ చీఫ్‌‌, సీఎం కేసీఆర్‌‌తో భేటీ అయ్యారు. పీకే టీం సర్వేలో 40 శాతానికి పైగా ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు వస్తున్న లీకులతో తమ పరిస్థితి ఏమిటా అని ఎమ్మెల్యేలు హైరానా పడుతున్నారు.

వరుసగా రెండు సార్లు, అంతకన్నా ఎక్కువ సార్లు గెలిచినోళ్లు 64 మంది

రాష్ట్ర అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలుండగా అందులో 102 మంది టీఆర్‌‌ఎస్‌‌కు చెందిన వారే. వీరిలో 64 మంది వరుసగా రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు గెలిచిన వాళ్లు ఉన్నారు. పీకే టీమ్‌‌ సర్వేలో ఎక్కువ ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిలో వరుసగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నట్టు ప్రచారంలో ఉంది. అసెంబ్లీలో మెజార్టీ సభ్యులు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వారే ఉండటంతో వాళ్లతో పాటు ఇతర పార్టీలకు చెందిన సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేల పనితీరుపైనా పీకే టీమ్‌‌‌‌‌‌‌‌ వివరాలు సేకరిస్తున్నారు. మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారిలో పావు వంతు మందిపైనా ప్రజాగ్రహం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పీకే టీమ్‌‌‌‌‌‌‌‌ సభ్యులు వివిధ వర్గాల ప్రజలు, మహిళలు, యువకులు, పలు వృత్తుల వారి నుంచి ఈ వివరాలు సేకరించినట్టు తెలుస్తున్నది.

ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బెటర్‌‌‌‌‌‌‌‌?

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశముందని పీకే టీమ్‌‌‌‌‌‌‌‌ సమాచారం సేకరిస్తున్నది. క్యాండిడేట్ల పేర్లు చెప్పకుండా మీ ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బెటర్‌‌‌‌‌‌‌‌ అని ప్రజలను ఆరా తీస్తున్నారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో ప్రజామోదం ఉన్న ముగ్గురు లీడర్ల పేర్లతో షార్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ తయారు చేసినట్టు సమాచారం. గెలిచే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఎవరు, ఏ పార్టీకి చెందిన వాళ్లు, వారికున్న బలాలు, మైనస్‌‌‌‌‌‌‌‌లు ఇలా అన్ని అంశాలతో రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలతో పాటు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లోనే ఇతర నాయకుల పేర్లు కూడా ఈ లిస్ట్​లో ఉన్నట్టు ప్రచారంలో ఉంది. కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో ఇటీవల పీకే సమావేశమైన టైంలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరు? అక్కడ ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు? అనే దానిపైనా చర్చ జరిగినట్టు ప్రచారంలో ఉంది. ఈ వార్తలతో తమ గురించి పార్టీ చీఫ్‌‌‌‌‌‌‌‌కు పీకే ఏం చెప్పారోనని ఎమ్మెల్యేలు గుబులు పడుతున్నారు. ఈసారి ఆరు నెలల ముందే ఎమ్మెల్యే క్యాండిడేట్లను ప్రకటిస్తామని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇదివరకే చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో పీకే టీం ఇచ్చే సమాచారమే కీలకం కావడంతో తమకు టికెట్‌‌‌‌‌‌‌‌ దక్కుతుందా లేదా అని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. తమ పరిస్థితిపై ఆరా తీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నా ఎలాంటి సమాచారం బయటికి రావడం లేదు. దీంతో వాళ్లంతా ఇంకింత హైరానా పడుతున్నరు. ఇటీవల ఏ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కలిసినా పీకే టీమ్‌‌‌‌‌‌‌‌ సర్వే గురించే మాట్లాడుకుంటున్నరు.

ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా

ఒక్కో నియోజకవర్గంలో పది నుంచి పన్నెండు మందితో కూడిన పీకే టీమ్ ఎమ్మెల్యేల గురించి పబ్లిక్​ ఏమనుకుంటున్నరో తెలుసుకుంటున్నది. ప్రధానంగా వాళ్లపై జనంలో ఉన్న ఫీడ్‌‌బ్యాక్‌‌ను కేసీఆర్‌‌కు అందించే పని పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపితే మళ్లీ గెలిచే అవకాశముందా?.. లేదా?.. అనే టార్గెట్​తో పీకే టీమ్‌‌​వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో గెలిచేది ఎవరు?, సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలపై ప్రజల అభిప్రాయం ఏంటి? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. పీకే టీమ్ చేస్తున్న సర్వేపై అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన కనిపిస్తున్నది. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో.. గులాబీ బాస్‌‌కు పీకే ఎలాంటి రిపోర్టు ఇస్తారో అని టెన్షన్ పడుతున్నారు.