మళ్ళీ ప్రభాస్ అంటే.. ఎన్టీఆర్ సినిమా పరిస్థితి ఏంటి?

మళ్ళీ ప్రభాస్ అంటే.. ఎన్టీఆర్ సినిమా పరిస్థితి ఏంటి?

కేజీఎఫ్(KGF) సిరీస్ తో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) తో సలార్(Salaar) సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. సెప్టెంబర్ 28న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో  రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సలార్ ని రెండు భాగాలుగా  తీస్తుకోస్తున్నారు. సలార్ 1 రిలీజ్ అయిన ఆరు నెలల్లోనే సీక్వెల్ ని కూడా తీసుకొచ్చే ప్లాన్ లో ప్రశాంత్ నీల్ ఉన్నాడు.

అఫీషియల్ గా డేట్ ఎనౌన్స్ చేయకపోయినా  వచ్చే ఏడాది వేసవిలో లేదంటే మొదటి ఆరు నెలల్లోనే సలార్ 2(Salaar2)ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ పార్ట్ 2కి సంబంధించిన కీలక సీక్వెన్స్ లు అన్ని కంప్లీట్ అయిపోయాయని టాక్ నడుస్తోంది. కొంత ప్యాచ్ వర్క్ ఉన్న సలార్ పార్ట్ 1 రిలీజ్ తర్వాత వాటిని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే సలార్ 2 పై ప్రశాంత్ నీల్ వెంటనే ఫోకస్ పెడితే జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తో చేయబోయే ఎన్టీఆర్  31(NTR31) పరిస్థితి ఏంటనే ప్రశ్న తారక్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది.  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో చేస్తోన్న దేవర కంప్లీట్ అయిన వెంటనే హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే వార్ 2(War2) షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఆ సినిమా కోసం 3 నెలల కాల్ షీట్స్ కేటాయించారు. దాని తర్వాత వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ స్టార్ట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.