
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. దీని తర్వాత నెక్స్ట్ షెడ్యూల్‌ను ఫారిన్‌లో ప్లాన్ చేశారట మేకర్స్.
ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో పాటు హీరోయిన్‌గా నటిస్తున్న రుక్మిణీ వసంత్, కీలక పాత్ర పోషిస్తున్న టోవినోథామస్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.అక్కడ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌తో పాటు సాంగ్ చిత్రీకరించనున్నారని సమాచారం.
ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 31వ చిత్రం. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. ఈ క్రమంలో తారక్ స్వాగ్ ఈసారి ఇంటర్నేషనల్ మోగుద్దని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు,
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
See you in cinemas on 25 June 2026…. #NTRNeel pic.twitter.com/SkMhyaF71c
— Jr NTR (@tarak9999) April 29, 2025