స్వీపర్ గా పని చేసిన ఆఫీస్ కే మేనేజర్ గా

స్వీపర్ గా పని చేసిన ఆఫీస్ కే మేనేజర్ గా

కొందరి జీవితాల్లో కొన్ని సమస్యలు, పరిస్థితులు వాళ్లని వెనక్కి నెడుతుంటాయి. వాటిని దాటుకొని నిలబడినపుడే లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సక్సెస్ అవ్వగలం అంటుంటారు చాలామంది. ఆ మాటలను నిజం చేస్తూ, స్వీపర్‌‌‌‌‌గా పనిచేసిన బ్యాంక్‌‌‌‌‌‌లోనే‌‌‌‌‌‌అసిస్టెంట్ జనరల్‌‌‌‌‌‌మేనేజర్‌‌‌‌‌‌‌‌గా‌‌‌‌‌ఎదిగింది ముంబైకి చెందిన యాభై ఎనిమిదేండ్ల ప్రతీక్షా టోండ్‌‌‌‌‌‌వాల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

ప్రతీక్ష సొంతూరు పుణే. పదో క్లాస్​ వరకు చదువుకున్న ప్రతీక్షకు, పదిహేడేండ్లకే సదాశివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పెండ్లి చేసి ముంబైకి పంపించారు తల్లిదండ్రులు. దాంతో పై చదువు చదవాలన్న తన కోరిక తీరలేదు. బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేసే సదాశివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రతీక్షకు ఇరవై ఏండ్లున్నపుడు రోడ్డు యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చనిపోయాడు. అప్పటి వరకు సంతోషంగా సాగిపోతున్న జీవితంలో ఒక్కసారిగా చీకటి నిండిపోయింది. అత్తామామల బాధ్యత ప్రతీక్ష భుజాల మీద పడింది. జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ఉన్నా తనకున్న క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఏ జాబూ దొరకదు. అందుకని ముంబైలో ఉన్న స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిఐ) స్వీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేరింది. 

నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో చేరి...

కొన్నాళ్లకు ‘స్వీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేస్తూ ఇంకా ఎన్నాళ్లు ఇలా ఉండాలి. నా చదువు పూర్తి చేసి ఏదైనా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి’ అనుకుంది. స్వీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తూనే నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో చేరింది. తను పడుతున్న కష్టం, పని మీద ఉన్న సిన్సియారిటీకి ఆ బ్యాంక్ వాళ్లు క్లర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రమోషన్ ఇచ్చారు. అయినా ఆ పని చేస్తూనే చదువుకునేది ప్రతీక్ష. అలా 1995లో సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసి, బ్యాంక్ జాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ప్రిపేర్ అయింది. తరువాత ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్వాలిఫై అయి, తన పనిచేస్తున్న బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే క్లాస్​ ఫోర్​ ఎంప్లాయిగా చేరింది. జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చినా చదవడం ఆపలేదు. 2021లో నేచురోపతీలో డిగ్రీ పట్టా కూడా తీసుకుంది. ఆమె పని తీరుకు మెచ్చి ఈ మధ్యే అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఎజిఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)గా ప్రమోషన్ ఇచ్చారు బ్యాంక్ అధికారులు. 

‘ఈ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముడిపడున్న ముప్పై ఏడేండ్ల బంధం ఇంకో రెండేండ్లలో ముగుస్తుంది. నేను రిటైర్ అయ్యాక కూడా ఏదైనా సేవ చేస్తూనే ఉంటా. నాలా చదువుకోవాలని ఉండే వాళ్లందరికి చదువు చెప్పిస్తా. వాళ్లకున్న పరిస్థితుల వల్ల పైకి రాలేనివాళ్లు చాలామందే ఉంటారు. వాళ్లకు కావాల్సిన సాయం అందిస్తా’ అని తన సన్మాన కార్యక్రమంలో చెప్పింది ప్రతీక్ష.