ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇవ్వాలి.. జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి డిమాండ్​

ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇవ్వాలి.. జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు పెండింగ్​లో ఉన్న 2017, 2021 పీఆర్సీలు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ, కరెంట్ ఉద్యోగులకు పీఆర్సీలు ఇస్తూ ఆర్టీసీ కార్మికులకు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని మంగళవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు ఒక్క పీఆర్సీ మాత్రమే ఇచ్చారని, కరెంట్ ఉద్యోగులకు 3, ప్రభుత్వ ఉద్యోగులకు 2 పీఆర్సీలు ఇచ్చారని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లకోసారి, ఆర్టీసీకి మాత్రం నాలుగేండ్లకు ఒక పీఆర్సీ అని తెలిపారు. కరెంట్, ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ కార్మికులకు జీతాలు చాలా తక్కువ ఉన్నాయని, ఆర్టీసీ అంటే ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ జీతాలు ఉన్నాయని పేర్కొన్నారు.