
గ్రేటర్ సిటీలో ముందస్తు బతుకమ్మ వేడుకలు సంబురంగా జరిగాయి. గురువారం సాయంత్రం కూకట్పల్లి విలేజ్లోని రామాలయం గుడి దగ్గర జరిగిన వేడుకల్లో మహిళలు, చిన్నారులు పాల్గొని బతుకమ్మ ఆడారు. రాంనగర్ డివిజన్ బాకారంలోని రెడ్ కాన్వెంట్ స్కూల్ ఆవరణలో, మణికొండలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. టీచర్లు, స్టూడెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.