మెట్రో ప్రాజెక్టుపై ప్రీ క్వాలిఫికేషన్ మీటింగ్

మెట్రో ప్రాజెక్టుపై ప్రీ క్వాలిఫికేషన్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఎక్స్​ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ జనరల్ కన్సల్టెంట్(జీసీ) కోసం మంగళవారం ప్రీ క్వాలిఫికేషన్​ మీటింగ్ జరిగింది. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్  రెడ్డి,  శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 23 నేషనల్, ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థలు పాల్గొన్నాయి. మెట్రో మొదటి దశ ప్రత్యేకతలను, ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.  టెక్నికల్​గా, ప్రాజెక్ట్ నిర్వహణ విధుల్లో హెచ్‌‌‌‌‌‌‌‌ఏఎంఎల్​కు జనరల్ కన్సల్టెంట్ సాయం అందిస్తుందని తెలిపారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రివ్యూ, టెండర్ డాక్యుమెంటేషన్ అండ్ వాల్యూయేషన్, డిజైన్ మేనేజ్​మెంట్, వివిధ కాంట్రాక్టర్లు, సరఫరాదారులు సమర్పించిన డిజైన్లు తదితర అంశాల్లో సహాయపడుతుందని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 13లోగా జనరల్ కన్సల్టెంట్ కోసం బిడ్‌‌‌‌‌‌‌‌లను సమర్పించాలన్నారు.  

శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి

గండిపేట: ఈ నెల 9న ఉదయం 10 గంటలకు మెట్రో సెకండ్​ ఫేజ్​ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శంకు స్థాపన అనంతరం రాజేంద్రనగర్​ పోలీస్ గ్రౌండ్​లో జరగనున్న బహిరంగ సభ స్థలాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మెట్రోఎండీ ఎన్వీఎస్​రెడ్డి, మేయర్‌‌‌‌‌‌‌‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌ మోతే శ్రీలత మంగళవారం మరోసారి పరిశీలించారు.