స్టార్ హీరోల సినిమా రిలీజ్ లెక్కలు..ఎలా ఉన్నాయో తెలుసా?

స్టార్ హీరోల సినిమా రిలీజ్ లెక్కలు..ఎలా ఉన్నాయో తెలుసా?

నవంబర్ మొత్తం ఎలక్షన్స్ అంటూ బిజీ బిజీ షెడ్యూల్స్ లో ఉన్నారు అందరు. ఇక సినిమా ఇండస్ట్రీ లో కూడా చెప్పుకోదగ్గ భారీ సినిమాలు కూడా నవంబర్ నెలలో రిలీజ్ అవ్వలేదు. ఇక ఈ నెల అయిపోతే మాత్రం తగ్గపోరు లేదన్నట్టు డిసెంబర్ అంత సినిమాల జాతరే. వరసపెట్టి థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. మరి డిసెంబర్ లో రాబోతున్న సినిమాల బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం. 

అర్జున్‌ రెడ్డి (Arjun reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir kapoor), నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) జంటగా వస్తున్న ఈ సినిమా..డిసెంబర్‌ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజ‌ర్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి.

ఈ సాలిడ్ కాంబోపై తెలుగునాట ఆసక్తి బాగానే వుంది. ఆంధ్ర ఏరియా (సీడెడ్ మినహా) రూ.6కోట్ల మేరకు చెబుతున్నారు. అంటే దాదాపు ఓ అబౌవ్ స్మాల్ రేంజ్ సినిమా అని చెప్పుకోవొచ్చు. ఇందులో నటించిన యాక్టర్స్ అంత బాలీవుడ్ వాళ్లే కావడంతో..ఆసక్తి తగ్గిందని తెలుస్తోంది. 

నాని (Nani) హీరోగా..శౌర్యవ్ (Shouryuv) డైరెక్షన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న. ఈ మూవీ డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్స్ ఆడియాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా నానికి యూత్ లో బాగా క్రేజ్ ఉండటం వల్ల మేకర్స్ చాలా హోప్ తో వున్నారు. కానీ ఆ మేరకు బయ్యర్లు మాత్రం సినిమా విషయంలో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇప్పటికే చాలా ఏరియాస్ లో మార్కెటింగ్ కూడా పూర్తయింది. ఒకటి రెండు ఏరియాలు తప్పితే మిగిలిన ఏరియాలు అంత  అమ్ముడయ్యాయి. దీంతో హాయ్ నాన్నరూ.10 నుంచి రూ.12 కోట్ల రేషియోలో మార్కెట్ చేసారు. మరి ఇది అంత పెద్ద రేంజ్ ఏం కాదు. కానీ ఆ జానర్కు తగినట్లు వచ్చినట్లే అని టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే..టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) హీరోగా వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ సైంధవ్‌ (SAINDHAV). హిట్‌ చిత్రాల దర్శకుడు శైలేష్‌ కొలను (Sailesh kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న 75వ సినిమా కావడంతో సైంధవ్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు ఆయన నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. దీంతో సైంధవ్ మూవీకి మాంచి పాజిటివ్ బజ్ వుంది. సైంధవ్‌  మూవీకి ఆంధ్ర ఏరియాల్లో అదిరిపోయే రేటు పలుకుతోంది. ఇప్పటివరకు రూ.12 కోట్ల మేరకు అన్ని ఏరియాల నుంచి దాదాపు మార్కెట్ చేసేసారు.

నితిన్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఎక్స్ ట్రా ఆర్టినరీ మాన్ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ డిసెంబర్ 8 న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ స్వంత సినిమా బ్యానర్ లో నిర్మించడంతో రెగ్యులర్ బయ్యర్లకే నిర్మాణ వ్యయాన్ని బట్టి గిట్టుబాటు అయిన రేట్లకు ఇచ్చేసినట్లు సమాచారం. 

మరి ఇందులో ఏ మూవీ అంచనాలను మించిన వసూళ్లను మేకర్స్ కు..బయ్యర్లకు అందిస్తుందో చూడాలి.