కరీంనగర్ టౌన్/కొత్తపల్లి/జగిత్యాల టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని పలు ప్రైవేట్ స్కూళ్లలో శుక్రవారం ముందస్తుగా సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ ది నెక్ట్స్(ఎస్6 క్యాంపస్), భగత్‌నగర్ అల్ఫోర్స్ ఇటెక్నో స్కూల్‌లో నిర్వహించిన వేడుకల్లో చైర్మన్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని కొనియాడారు.
కొత్తపల్లి మండలం రేకుర్తి, విద్యానగర్, కరీంనగర్‌రూరల్ మండలం తీగలగుట్టపల్లిలోని సెయింట్ జార్జ్ నినోస్ బ్లాక్‌ల్లో చైర్మన్ పి.ఫాతిమారెడ్డి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థుల హరిదాసు వేషధారణలు, కీర్తనలు, భోగి పండ్లు, భోగి మంటలు ఆకట్టుకున్నాయి.
జగిత్యాల జిల్లాకేంద్రంలోని జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. రంగురంగుల ముగ్గులు, మామిడి తోరణాలు, చెరకు దండలు, దీపాలతో అలకరించారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రాల్లో నృత్యాలు, పాటలు, చిన్న నాటికలు ప్రదర్శించి, సంస్కృతిలోని ఐక్యత, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించారు. స్కూల్ డైరెక్టర్లు హరిచరణ్ రావు, శ్రీధర్‌రావు, మౌనిక రావు, అజిత, టీచర్లు పాల్గొన్నారు.
