- పసిడితోనే ఎక్కువ రాబడులు
- పీఎల్ అసెట్ మేనేజ్మెంట్ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ కంటే బంగారం, వెండి వంటి విలువైన లోహాలే ఎక్కువ రాబడిని ఇచ్చాయని ప్రభుదాస్ లీలాధర్(పీఎల్) అసెట్ మేనేజ్మెంట్ రిపోర్ట్ వెల్లడించింది. దీని ప్రకారం..సెంట్రల్ బ్యాంకుల నుంచి వీటికి డిమాండ్ పెరగడం వల్ల పెట్టుబడిదారుల సంపదకు రక్షణగా నిలిచాయి.
ఇప్పుడు మార్కెట్ పెరగడం కన్నా వివిధ ఆస్తుల్లో పెట్టుబడులను కేటాయించడానికే ప్రాధాన్యం కనిపిస్తోంది. తమ ఆక్వా వ్యూహం డిసెంబరులో మార్కెట్ పతనాన్ని సమర్థంగా తట్టుకుందని, బెంచ్ మార్క్ 0.24 శాతం పడిపోగా, ఆక్వా కేవలం 0.17 శాతం నష్టంతో సరిపెట్టుకుందని పీఎల్అసెస్ మేనేజ్మెంట్ తెలిపింది.
‘ఇది ప్రారంభమైన నాటి నుంచి 23 శాతం వార్షిక రాబడిని అందించింది. మార్కెట్లో రిస్క్ తీసుకోవడం పెరుగుతోంది. కంపెనీల ఆదాయాలు మెరుగుపడితే మార్కెట్లు మళ్ళీ బలోపేతం అవుతాయి’ అని రిపోర్టు తెలిపింది.
