
- మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి ఇండ్లలో ఐటీ రైడ్స్ జరిగాయన్న వార్తలను ప్రీతి రెడ్డి ఖండించారు. కొంపల్లిలోని తన నివాసంలో గురువారం ఆమె మాట్లాడారు. గతంలో జరిగిన ఈడీ రైడ్స్ కేసు వెరిఫికేషన్ కోసమే పోలీసులు వచ్చారన్నారు. 2023లో జరిగిన కాళోజీ రావు యూనివర్సిటీ పీజీ సీట్ల కేసు విచారణలో భాగంగా వరంగల్ పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వచ్చారని, ఐటీ రైడ్స్ జరగలేదని తెలిపారు