వీడియో: ఊరికి రోడ్డు లేక.. నిండుచూలాలిని బుట్టలో మోసుకెళ్లిన కుటుంబసభ్యులు

వీడియో: ఊరికి రోడ్డు లేక.. నిండుచూలాలిని బుట్టలో మోసుకెళ్లిన కుటుంబసభ్యులు

సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో గర్భవతిని బుట్టలో కూర్చోబెట్టి మోసుకొచ్చిన ఘటన ఛత్తీస్‌గర్ లో జరిగింది. సర్గుజా జిల్లాలోని కడ్నాయ్ గ్రామానికి చెందిన ఓ గర్భవతికి నెలలు నిండాయి. దాంతో ఆమె కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నారు. అయితే భారీవర్షాల వల్ల వారి గ్రామానికి ఆనుకొని ప్రవహిస్తున్న నది ఉప్పొంగుతుంది. ఆ దారి మాత్రమే వారి గ్రామానికున్న ఏకైక మార్గం. దాంతో ఆ గర్భవతి కుటుంబసభ్యులు ఒక పొడవాటి కర్రకు మధ్యలో ఒక బుట్టను కట్టి.. అందులో ఆమెను కూర్చొబెట్టుకొని నదిని దాటారు. అనంతరం మహిళను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

‘మంచి ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం ఇక్కడ విషయం కాదు. వర్షాకాలంలో ఇలా ఇబ్బందుపడే మారుమూల గ్రామాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలలోని ప్రజల కష్టాలను తగ్గించడానికి చిన్న కార్లను ఉపయోగించాలని జిల్లా పరిపాలన విభాగం యోచిస్తోంది. కార్ల ద్వారా ప్రజలందరి ఇళ్లకు చేరుకోవడం సాధ్యం కాదు. కానీ, అవసరమైన వారికి మాత్రం సహాయపడటానికి మేం ప్రయత్నిస్తాము’ అని సుర్గుజా కలెక్టర్ సంజయ్ కుమార్ ఝా తెలిపారు.

For More News..

రాష్ట్రంలో కొత్తగా 1891 కరోనా కేసులు

కరోనాను జయించిన 110 ఏళ్ల బామ్మ

కరోనాతో ఎంజీఎం ల్యాబ్ టెక్నిషియన్ మృతి

పెళ్లయి.. ఒక పిల్లాడు.. అయినా ఇంటర్‌‌‌‌లో టాపర్ గా..