
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో తాండూరులోని మాత శిశు హాస్పిటల్లో నిండు గర్భిణి మృతి చెందింది. కొడంగల్మండలం రావులపల్లికి చెందిన అఖిల(23)కు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తాండూరు మాత శిశు హాస్పిటల్కు తరలించారు. సోమవారం ఉదయం పరీక్షించిన డాక్టర్లు.. బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వేరే హాస్పిటల్కు తీసుకెళ్లాలని సూచించారు. ఇంతలోనే అఖిల మృతి చెందింది. అఖిల మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రసవానికి వస్తే పాణం తీశారని కన్నీరుమున్నీరయ్యారు.