
వికారాబాద్ జిల్లా తాండూరులో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు చూలాలు మృతి చెందింది. సోమవారం ( సెప్టెంబర్ 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తాలూకా రావులపల్లి గ్రామానికి చెందిన అఖిలకు పురిటి నొప్పులు రావడంతో ఆదివారం ( సెప్టెంబర్ 21 ) రాత్రి 1 :30 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అఖిలకు టెస్టులు చేసిన డాక్టర్లు అంతా నార్మల్ గా ఉందని చికిత్స ప్రారంభించారు.
ఆ తర్వాత వేకువ జామున 4 గంటల సమయంలో పరిస్థితి చెజారిందని వేరే హాస్పిటల్ తీసుకెళ్లండని.... బలవంతంగా డిశ్చార్జ్ లెటర్ లో సంతకం తీసుకున్నారని బంధువులు ఆరోపించారు...నిర్లక్ష్యం వహించిన Dr మంజులను సస్పెండ్ చేయాలని బంధువులు ఆందోళన చేస్తున్నారు.
అఖిల మృతికి కారణమైన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబసభ్యులు, బంధువులు. రాష్ట్రంలోనే ప్రసవాలు ఎక్కువగా జరిగావని తాండూరు మాతా శిశు హాస్పిటల్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలాచే ఉత్తమ అవార్డు పొందడం గమనార్హం.