పెళ్లి తర్వాత థ్రిల్ చేసేలా... ప్రేమంటే

పెళ్లి తర్వాత థ్రిల్ చేసేలా... ప్రేమంటే

ప్రియదర్శి, ఆనంది జంటగా సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘ప్రేమంటే’.  థ్రిల్ యు ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్‌‌‌‌లైన్. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.  రానా దగ్గుబాటి సమర్పణలో  పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. నవంబర్ 21న సినిమా విడుదల కానుంది. ఆదివారం టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.   కొత్త పెళ్లి జంట జీవితంలోని సరదా, ప్రేమ, గిల్లికజ్జాలను  హిలేరియస్ గా చూపిస్తూ కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.   

పెళ్లి తర్వాత కలల ప్రపంచంలో ఊహించిన ప్రేమకథ, వాస్తవ జీవితంలోని చిన్న చిన్న సమస్యలతో ఎలా మలుపులు తిరుగుతుందో ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేశారు.  ప్రియదర్శి, ఆనంది జంటగా కనిపించి, కొత్త దంపతుల జీవితంలో జరిగే సన్నివేశాలని అలరించేలా చూపించారు. పెళ్లి తర్వాత లైఫ్ థ్రిల్లింగ్‌‌‌‌గా ఉండాలని హీరోయిన్ ఆనంది కోరుకుంటే దానికి విరుద్ధంగా తన లైఫ్ సాగుతుంది.  

సుమ కనకాల పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌‌‌‌గా ఎంట్రీ ఇవ్వడంతో కథలో కొత్త మలుపు వస్తుంది.  ఆమె పాత్ర హ్యుమర్‌‌‌‌‌‌‌‌ని మరింత ఎలివేట్ చేసింది.  ‘అందమైన  వైభవాల వేడుకే కదా ప్రేమంటే..చూపుతోటే మనసు చదివే మధురమే కదా ఈ ప్రేమంటే’ అంటూ లియోన్ జేమ్స్ బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌తో సాగిన టీజర్ ఇంప్రెస్ చేసింది.