కాకతీయ కళాతోరణాన్ని తొలగించే ఆలోచన మానుకోవాలి: ప్రేమేందర్ రెడ్డి

కాకతీయ కళాతోరణాన్ని తొలగించే ఆలోచన మానుకోవాలి: ప్రేమేందర్ రెడ్డి
  • కాకతీయ కళాతోరణాన్ని తొలగించే ఆలోచన మానుకోవాలి
  •     బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజముద్రపై ఉన్న వరంగల్ కాకతీయ తోరణాన్ని తొలగించాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కాకతీయ సామ్రాజ్యం, సుపరిపాలనకు గుర్తుగా భావిస్తారని గుర్తుచేశారు. తెలంగాణ అంటే కాకతీయ సామ్రాజ్యం, పరిపాలననే అభిప్రాయం ప్రజలందరిలో ఒక తీపి గుర్తుగా ఉన్నదని చెప్పారు. 

కాకతీయ కళాతోరణం తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని, దాన్ని రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పట్టణానికి స్మార్ట్ సిటీతో పాటు హెరిటేజ్ సిటీగా గుర్తింపుని ఇచ్చారని ప్రేమేందర్ పేర్కొన్నారు.