బీహార్ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం పనితీరు తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. EVM స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర సీసీటీవీలు ఆఫ్ చేసి ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వచ్చిన గంటల వ్యవధిలోనే.. రోడ్లపైన వీవీ ప్యాట్ స్లిప్పులు (VVPAT) లభించడం సంచలనంగా మారింది. రోడ్లపైన స్లిప్పులు కుప్పలు తెప్పలుగా దొరకడం ఆ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
2025 నవంబర్ 06న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ పూర్తవగా.. 8వ తేదీన సమస్తిపూర్ కాలేజీ సమీపంలో స్లిప్పులు దొరకడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ వివాదంతో ఇద్దరు ఎన్నికల అధికారులను సస్పెండ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
వీవీప్యాట్ స్లిప్పులకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బీహార్ లో ఓట్ చోరీ ఎలా జరుగుతుందో చూడంటంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సమస్తాపూర్ జిల్లాలోని KSR కాలేజీ సమీపంలో ఉన్న వీవీ ప్యాట్ స్లిప్పులకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అయితే అవి మాక్ పోలింగ్ కు సంబంధించిన స్లిప్పులు అని వివరణ ఇచ్చారు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదోనని ముందుగా చెక్ చేసిన స్లిప్పులు అని తెలిపారు. అయితే అవి మాత్రం ఇప్పుడే ఎందుకు బయటకు రావాలని రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇద్దరు అధికారులు సస్పెండ్:
సరై రంజన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ స్లిప్పుల వ్యవహారం దుమారం రేపుతుండటంతో జిల్లా ఎన్నికల అధికారి రోషన్ కుశ్వాహ సమస్తాపూర్ కు చేరుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు రిటర్నింగ్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల సంఘంపై ఆర్జేడీ, కాంగ్రెస్ ఫైర్:
బీహార్ లో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నట్లు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈవీఎం రిజెక్ట్ చేసిన వీవీప్యాట్ లు కుప్పలుగా బయటపడ్డాయని.. ఎవరి ఆదేశాల మేరకు వీటిని పడేశారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న గుండాల సహకారంతోనే బీహార్ లో అవినీతికి పాల్పడే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్.
समस्तीपुर के सरायरंजन विधानसभा क्षेत्र के KSR कॉलेज के पास सड़क पर भारी संख्या में EVM से निकलने वाली VVPAT पर्चियां फेंकी हुई मिली।
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 8, 2025
कब, कैसे, क्यों किसके इशारे पर इन पर्चियों को फेंका गया? क्या चोर आयोग इसका जवाब देगा? क्या यह सब बाहर से आकर बिहार में डेरा डाले लोकतंत्र के… pic.twitter.com/SxOR6dd7Me
