
హైదరాబాద్, వెలుగు : బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈసీ సీఈవో సుదర్శన్ రెడ్డికి శనివారం ఫిర్యాదు చేశారు.
కోట్లు ఇచ్చి టికెట్ కొన్నట్లు ఓ పత్రిక లో వచ్చిన వార్త ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్లిప్ పార్టీ కార్యకర్తలను, నేతలను అయోమయానికి గురిచేస్తుందని ప్రేమేందర్ పేర్కొన్నారు.