నిజామాబాద్​లో మోదీ సభ సన్నాహక సమావేశం

నిజామాబాద్​లో మోదీ సభ సన్నాహక సమావేశం

బోధన్, వెలుగు: నిజామాబాద్​లో ఈ నెల3న జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నిజామాబాద్ ​జిల్లా పార్లమెంట్​ఇన్​చార్జి వెంకటరమణి కోరారు. శనివారం బోధన్​టౌన్, సాలూరా మండల కేంద్రాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు గ్రామాలను అధిక సంఖ్యలో జనాలను తరలించాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా ఇన్​చార్జి బాల్​ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్​రెడ్డి, వడ్డీ  మోహన్​రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్, బోధన్ నియోజకవర్గ ఇన్​చార్జి రాజేశ్వర్ రావు దేశ్ పాండే, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, బీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ శైలేష్ తదితరులు పాల్గొన్నారు.