ఇలాంటి ఫ్రైడ్ రైస్, బిర్యానీ తింటే.. కచ్చితంగా కడుపు నొప్పి వస్తుందంట..!

ఇలాంటి ఫ్రైడ్ రైస్, బిర్యానీ తింటే.. కచ్చితంగా కడుపు నొప్పి వస్తుందంట..!

చాలామంది షుగర్ ఉన్నవారు బ్రౌన్ రైస్ తింటారు.  ఇది తింటే ఆరోగ్యమని చాలా వ్యాధులకు చెక్ పెట్టొచ్చని అంటారు.  మీరు కూడా నిత్యం బ్రౌన్ రైస్ నే తింటున్నారా... అయితే ఈ వార్త మీకోసమే.   

సోషల్ మీడియాలో ఫుడ్ ఐటమ్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.  కొంతమంది కుక్ లు సోషల్ మీడియాను ఫాలో అవుతూ కొత్త కొత్త వంటకాలను పోస్ట్ చేస్తుంటారు.  అవిచాలా వరకు వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతుంటారు.  ఇప్పుడు అలాగే బ్రౌన్ రైస్, వెన్న మిశ్రమంతో చేసిన వంటకం సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.  

 బ్రౌన్ రైస్ తింటే ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలిపే వీడియో ఒకటి వైరల్ అవుతుంది.  దీనికి మిలియన్ల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి.  సాధారణంగా వెన్నతో అనేక తినుబండారాలు తయారు చేస్తుంటారు.  దీంతో చాలా అద్భుతాలు సృష్టించవచ్చు.  వెన్నలో ఎక్కువుగా కేలరీలు, కొవ్వు పదార్ధాలు ఉంటాయి.  ఇక ఈ వీడియోలో ఉప్పు, మసాల, వెన్న   ఒక పాత్రలో  మిక్స్ చేస్తారు. ఇందులో వెన్న శాతం అధికంగా ఉంది.   తరువాత  ఒక వ్యక్తి స్టవ్ పై పాన్ ( మూకుడు) ఉంచి సన్నని మంటపై వేడి చేస్తారు.  వెన్న కరుగుతుండగా  పాటు కరివేపాకు, ఉల్లిపాయలు, క్యాప్సికం, క్యారెట్, కేబేజీ వంటి తరిగిన కూరగాయలను వెన్నలో వేయించాలి.  తరువాత ఉప్పు మసాలాతో మిక్సింగ్ చేసిన పదార్దాన్ని  అందులో కలపాడు.  అయితే ఎంత టేస్టీగా ఉందో స్పష్టంగా ఎవరూ చెప్పలేదు కాని అది తింటే మాత్రం గుండెజబ్బులు రావడం కాయమని కామెంట్లు పెడుతున్నారు. 

ఈ వీడియోను ముంబైకార్‌ఫుడీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేయబడింది.  దీనికి  హార్ట్ ఎటాక్ బ్రౌన్ రైస్  అనే క్యాప్షన్‌తో పాటు మండుతున్న ఎమోటికాన్ అని వ్రాశారు.  ఈ వీడియో వైరల్ కావడంతో  4.2 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి.  దీనిపై నెటిజన్లు స్పందించారు.  మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలకు వెల్ కమ్ చెప్పడమేనని ఒకరు పోస్ట్ చేయగా.. మరొకరు చాట్ లో అధిక కొలెస్ట్రాల్ ఉందని  కామెంట్ చేశారు.  ఇంకొకరు డైరక్ట్ గా గుండెపోటు ప్లేట్ అని అడగవచ్చని పోస్ట్ చేవారు. ఇది వెన్నలో వేయించిన బియ్యం కాదని,, వెన్న అన్నమని వ్యాఖ్యానించారు.