
కోహెడ,వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని తంగళ్లపల్లి మోయతుమ్మే ద వాగు సింగరాయ ప్రాజెక్టు వద్ద ఈ నెల 21 నుంచి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆహ్వానించారు. శుక్రవారం హైదరాబాద్ లో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో తాను జాతరకు వచ్చి అమ్మవార్లకు ఎత్తు బంగారం ఇచ్చానన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు సత్తయ్య, నారాయణ, కొమురయ్య, అశోక్, సంపత్, అబ్దుల్ రఫీ ఉన్నారు.