వైట్ హౌస్ ప్రకటన.. ఫస్ట్ టైం ఇండియాకు ట్రంప్ దంపతులు

వైట్ హౌస్ ప్రకటన.. ఫస్ట్ టైం ఇండియాకు ట్రంప్ దంపతులు

భారత్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  టూర్ కన్ఫమ్ అయ్యింది.  ఫిబ్రవరి 24-25 రెండు రోజుల పాటు ట్రంప్ భారత్ లో పర్యటించనున్నట్లు వైట్ హౌస్  ప్రకటించింది. తొలిసారి భారత్ రానున్న ట్రంప్ ఆయన వైఫ్ మెలానియా ట్రంప్ తో కలిసి ఢిల్లీ, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. అలాగే  ట్రంప్ ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఈ పర్యటనతో భారత్ అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని వైట్ హౌస్ తెలిపింది.