కొత్త గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం..

కొత్త గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం..

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. మహారాష్ట్ర కొత్త గవర్నర్​గా రమేశ్ బైస్​ను నియమించారు. ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాజీనామాను ఆమోదించారు. ఇప్పటివరకు రమేశ్ బైస్ ఝార్ఖండ్ గవర్నర్​గా ఉన్నారు. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కూడా కొత్త గవర్నర్ ను నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్​ను ఏపీ గవర్నర్​గా నియమించారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ఉన్నారు.

మొత్తం12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

* అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్​గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్​
* సిక్కిం గవర్నర్​గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
* ఝార్ఖండ్ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్
* అసోం గవర్నర్​గా గులాబ్ చంద్ కటారియా
* హిమాచల్​ప్రదేశ్ గవర్నర్​గా శివ్ ప్రతాప్

* ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

* ఛత్తీస్‌గఢ్ గవర్నర్ సుశ్రీ అనుసూయా ఉక్యే మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

* మణిపూర్ గవర్నర్ గణేశన్ నాగాలాండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

* హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

* అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లడక్ లెఫ్టినెంట్ గవర్నర్‌ (ఎల్ జీ)గా నియమితులయ్యారు.