దేశం గర్వపడేలా చేశారు..ఇస్రోపై రాష్ట్రపతి ప్రశంసలు

దేశం గర్వపడేలా చేశారు..ఇస్రోపై రాష్ట్రపతి ప్రశంసలు

ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.  చంద్రయాన్ 3 సక్సెస్  చేసి దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు.   చంద్రయాన్ 3లో భాగమైన ప్రతీ శాస్త్రవేత్తకు తన అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంతో ఇస్రోశాస్త్రవేత్తలు సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు.   ముందు ముందు ఇలాంటి ప్రయోగాలు మరెన్నో చేయాలని కోరారు. 

చంద్రయాన్ 3 ల్యాండింగ్ ను లైవ్ టెలికాస్ట్ లో చూశారు. ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే ఆనందంతో చప్పట్లు కొడుతూ తన ఆనందం వ్యక్తం చేవారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ 3  ల్యాండింగ్ సక్సెస్ తో భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండయిన తొలి దేశంగా హిస్టరీ క్రియేట్ చేసింది.  చంద్రయాన్ సక్సెస్ తో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన మోడీ..  తన జీవితం ధన్యమైందన్నారు.