
రెండవ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకున్నారు ప్రముఖులు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రిటైర్డ్ జడ్జి జస్టిస్ జగదీశ్ సింగ్ కేహార్, ప్రముఖ ఫోక్ సింగర్ శారద సిన్హా లకు పద్మవిభూషన్ అవార్డులు అందించారు. ఇక ప్రముఖ నటి, ఫోక్ డ్యాన్స్ విభాగంలో పద్మ భూషన్ అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మందకృష్ణ మాదిగ, కెఎల్ కృష్ణ, వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి తదితరులు పద్మ అవార్డులు అందుకున్నారు.
గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించి పద్మ అవార్డులు తొలి విడతలో ఏప్రిల్ 28న ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, కళా రంగంలో పద్మభూషణ్‌కు ఎంపికైన సినీ నటుడు బాలకృష్ణ, పద్మశ్రీకి ఎంపికైన మాడుగుల నాగఫణిశర్మ, రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ విశిష్ట పౌర పురస్కారాలను అందుకున్నారు.
ఈ ఏడాదికిగానూ ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో సోమవారం నలుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 57 మందికి పద్మ శ్రీ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. ఇందులో సినీ నటుడు అజిత్, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, ఇతర ప్రముఖులు ఉన్నారు.
Shobana Chandrakumar, an artist in the field of classical dance and cinema, is conferred with the Padma Bhushan. Her artistry, dedication, and influence have significantly enriched India’s cultural and artistic heritage.#ShobanaChandrakumar #PadmaBhushan #PadmaAwards2025 #Art… pic.twitter.com/MKON7NJDTT
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) May 27, 2025