రాజ్‌పథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. ఎన్నో ప్రత్యేకతలు

రాజ్‌పథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. ఎన్నో ప్రత్యేకతలు

దేశ రాజధాని ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియాస్‌ బొల్సొనారో వచ్చారు. రాష్ట్రపతి జెండా ఎగరేశాక భారత సంస్కృతిని చాటేలా రాష్ట్రాల శకటాలు, మిలటరీ శక్తిని తెలిపేలా ఆయుధాలు, సైనిక కవాతులు, సాంకేతిక విజ్ఞాన ప్రదర్శనతో రిపబ్లికే డే పరేడ్ సాగుతోంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌ను లెఫ్టినెంట్ జనరల్ అసిత్ మిస్త్రీ కమాండింగ్ ఆఫీసర్‌గా ముందుండి లీడ్ చేస్తున్నారు. తొలిసారి మహిళా కెెప్టెన్ తానియా పూర్తిగా పురుష కెప్టెన్స్‌తో కూడిన కమాండ్‌కు నాయకత్వం వహించడం ఈ ఏడాది పరేడ్‌లో ప్రత్యేకత.  అంతరిక్షంలోని శత్రు దేశాల శాటిలైట్స్‌ను సైతం ధ్వంసం చేయగల శక్తి కలిగిన ‘మిషన్ శక్తి’ క్షిపణి ప్రదర్శన మరో హైలైట్. ఎన్నో ప్రత్యేకతలతో 71వ గణతంత్ర దినోత్సవ పరేడ్ సాగుతోంది.

ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, సీజేఐ జస్టిస్ బోబ్డే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌  జాతీయ యుద్ధ స్మారక కేంద్రాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు.

More News:

మైనస్ 20 డిగ్రీల మంచులో జవాన్ల జెండా వందనం: వీడియో

నాలుగు తరాలుగా ఆర్మీకే అంకితం: కెప్టెన్ తానియాకి స్పెషల్ చాన్స్