శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి వెంట అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ 

తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని  భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఉన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న  రాష్ట్రపతి దంపతులకు టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌‌, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మ‌న్‌ అందించారు. 

రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారినితిరుమల శ్రీవారిని దర్శనార్థం  తిరుమలకు కుటుంబ సమేతంగా వచ్చిన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రేణిగుంట ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఉదయం 10.45 గంటలకు  రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న  భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ,  ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చిత్తూరు జిల్లా ఇంచార్జి మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డిపంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిఎపిఐఐసి ఛైర్మన్ శ్రీమతి రోజాటిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డిపార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి రెడ్డెప్ప పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ,  శాసన సభ్యులు ఆదిమూలం బియ్యపు మధుసూధన రెడ్డి భూమన కరుణాకర రెడ్డిచింతల రామచంద్రా రెడ్డి నవాజ్ బాషా ,  వెంకటే గౌడపెద్దిరెడ్డి ద్వారకానాధ రెడ్డి జంగాలపల్లి శ్రీనివాసులు బాబు , జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ నారాయణ్ గుప్త, అడిషనల్ డిజిపిలు చంద్రశేఖర్ ఆజాద్, హరీష్ కుమార్, నగరపాలక కమిషనర్ గిరీషా, జెసి మార్కండేయులు, ఎపిడి సురేష్, సివిఎస్ ఓ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కామాండెంట్ శుక్లా,  తిరుపతి ఆర్బన్ ఎస్.పి.రమేష్  రెడ్డిచిత్తూరు ఎస్.పి.సెంధిల్ కుమార్ , జెసి (సంక్షేమం) రాజశేఖర్ , డిఆర్ఓ మురళిఆర్డీఓ కనక నరసా రెడ్డి, బిజేపి నేతలు సోమూవీర్రాజు, భానుప్రకాష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శాంతారెడ్డి స్వాగతం పలికారు.

కొత్త విమానంలో తిరుమలకు రాక

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రులు ప్రయాణించేందుకు ఎయిర్ ఇండియా కొత్తగా తయారుచేయించిన ఎయిరిండియా వన్ బి 777 విమానానికి భారత రాష్ట్రపతి దంపతులు పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాయుసేన , త్రివిధ దళాలకు చెందిన ముఖ్య అధికారులు భారత రాష్ట్రపతి దంపతులతో ప్రత్యేక గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఢిల్లీ నుండి నిన్న చెన్నై కు వచ్చిన ఆయన ఉదయం 10.45 గంటలకు చెన్నై నుండి తిరుమలకు వచ్చారు. రాష్ట్రపతి రాక సందర్భంగా తిరుమలలో అడుగడుగునా పోలీసులను మొహరించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

for more News…

వంద మిలియన్ల ఫాలోవర్లను సాధించిన మొట్టి మొదటి టిక్ టాక్ స్టార్

ప్రాజెక్టు ఏదైనా.. పేదల భూముల్లే లాక్కుంటున్నారు

పబ్జీ బంపర్ ఆఫర్: టోర్నీ గెలిస్తే కోట్లు, గేమ్ ను డిజైన్ చేస్తే లక్షల్లో జీతాలు

ఎలక్షన్లు రాంగనే… ఓటర్లపై ప్రేమ పుట్టె