ఏపీలో దళితుడికి గుండు ఘటనపై రాష్ట్రపతి సీరియస్

ఏపీలో దళితుడికి గుండు ఘటనపై రాష్ట్రపతి సీరియస్

ఘటనపై ఎంక్వైరీ చేయండి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్‌కు గుండు గీయించిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సీరియస్‌‌గా స్పందించారు. తనకు గుండు గీయించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని, తాను నక్సలైట్‌‌గా మారేందుకు అనుమతివ్వాలని రాష్ట్రపతికి వరప్రసాద్ మెయిల్ లో ఫిర్యాదు చేశాడు. 24 గంటల్లోనే స్పందించిన రాష్ట్రపతి ఈ ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. బాధితుడికి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ ఏపీ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌‌ లో అసిస్టెంట్ సెక్రటరీ జనార్థన్ బాబును విచారణ అధికారిగా నియమిస్తూ ఫైల్ ను రాష్ట్రపతి భవన్ ట్రాన్స్‌‌ఫర్ చేసింది. జనార్థన్ బాబుని కలిసి ఘటనకు సంబంధించిన కాల్ రికార్డులు,
వీడియో క్లిప్పులు, ఇతర సాక్ష్యాలు సమర్పించాలని వరప్రసాద్‌కు సూచించింది. తన కంప్లయింట్ పై రాష్ట్రపతి స్పందించడంతో తనకు న్యాయం దక్కుతుందనే భరోసా ఏర్పడిందని వరప్రసాద్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైఎస్సార్ సీపీ నేత ఫిర్యాదుతో వరప్రసాద్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని తీవ్రంగా గాయపరచడంతో పాటు పోలీస్ స్టేషన్‌‌ లోనే గుండు గీయించారు. ఈ ఘటనపై దుమారంరేగడంతో ఇందుకు కారకులైన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

For More News..

రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాలు దాటిన సాగు

అసెంబ్లీ ముందుకు ఇరిగేషన్ రీ ఆర్గనైజేషన్

ఓటర్ల లిస్ట్‌లో సవరణకు చాన్స్

రిమ్స్ వార్డుల్లో ఎలుకలు.. రోడ్ల మీద పేషంట్లు..