చైనాకు రాష్ట్రపతి కోవింద్ ఇన్ డైరెక్ట్ వార్నింగ్

చైనాకు రాష్ట్రపతి కోవింద్ ఇన్ డైరెక్ట్ వార్నింగ్

మా నేలను ఆక్రమించేందుకు తెగిస్తే సహించం
74వ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రెసిడెంట్ కోవింద్
చైనాకు ఇండైరెక్ట్ వార్నింగ్
కేంద్రం స్ట్రాటజీలతో కరోనాపై విజయం

న్యూఢిల్లీ: ‘‘ఇండియా శాంతినే నమ్ముతుంది. ఎవరైనా దురాక్రమణలకు తెగిస్తే తగిన బుద్ధి చెప్పగలసత్తా కూడా ఉంది’’ అని ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ చైనాకు ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మన పొరుగున ఉన్న కొందరు విస్తరణ కోరికతో మిస్ అడ్వెంచర్ కు పాల్పడుతున్నారు’’ అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. బోర్డర్ వెంబడి చైనా చొరబాటు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయన ఇన్ డైరెక్ట్ గా ఆ దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. 74వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రెసిడెంట్ కోవింద్ శుక్రవారం టీవీలో మాట్లాడారు. మన ఫ్రీడమ్ మూమెంట్ కు మహాత్మాగాంధీ మారద్గర్శిగా ఉండటం మన అదృష్టమని ప్రెసిడెంట్ చెప్పారు. ఒక యోగి, ఒక రాజకీయనేతకు మధ్య కోఆర్డినేషన్ కేవలం ఇండియాలోనే సాధ్యమని ఆయన వ్యక్తిత్వం నిరూపించిందన్నారు. కరోనా మహమ్మారి వల్ల అన్ని యాక్టివిటీలూ స్తంభించిపోయాయని, మన ప్రపంచమే మారిపోయిందని అన్నారు. ఈసారి ఇండిపెండెన్స్ డే వేడుకలు ఎప్పటిలా జరగబోవన్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రధాని మోడీ సర్కారు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకుందన్నారు. ఇంత పెద్దదేశంలో ఇలాంటి విపత్తును ఎదుర్కోవాలంటే ‘సూపర్ హ్యూమన్’ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుందని, కేంద్రం దీనిని సమర్థంగా ఎదుర్కొందని మెచ్చుకున్నరు. రాష్ట్రాలూ తగిన చర్యలతో వైరస్ ను కట్టడి చేశాయని, దేశ ప్రజలు కూడా సంక్షోభాన్ని నివారించేందుకు మంచి సహకారం అందించారన్నారు. కరోనాపై పోరులో ఇతర దేశాలకూ ఇండియా సాయం చేసిందన్నారు. ఈ కష్టకాలంలో అనేక దేశాలకు మందులు అందించి ప్రపంచ మానవాళికి అండగా నిలిచిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమంపైనా ప్రెసిడెంట్ మాట్లాడారు. ఆత్మ నిర్భర్ అంటే.. స్వదేశంలో కెపాసిటీని పెంచుకోవడమేనని, అంతే తప్ప ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లను పూర్తిగా పక్కనపెట్టడం కాదన్నారు.

‘గల్వాన్‌’ అమరులకు సెల్యూట్..
జూన్ 15న గల్వాన్ వ్యాలీ వద్ద చైనాతో జరిగిన గొడవలో అమరులైన 20 మంది మన సోల్జర్లకు ప్రెసిడెంట్ కోవింద్ నివాళులు అర్పించారు. దేశ సరిహద్దులను కాపాడేందుకు ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ‘‘మనం శాంతినే నమ్ముతున్నాం. అదే సమయంలో ఎలాంటి దురాక్రమణకైనా తగిన బుద్ధి చెప్పగలమన్న విషయాన్ని మన వీర సైనికులు తమ పోరాటంతో చాటిచెప్పారు. దేశ సరిహద్దులను కాపాడుతూ మన ఇంటర్నల్ సెక్యూరిటీని పటిష్టం చేస్తున్న మన సాయుధ బలగాలు, పారామిలటరీ ఫోర్సెస్, పోలీసులు మనకు గర్వకారణం’’ అని ప్రెసిడెంట్ చెప్పారు.

దేశం డాక్టర్లకు రుణపడి ఉంది..
కరోనా మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్ స్టాఫ్ కు దేశం రుణపడి ఉందని ప్రెసిడెంట్ కోవింద్ అన్నారు. అందరం కలిసికట్టుగా వైరస్ ను కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యామని, పెద్దఎత్తున ప్రజల ప్రాణాలను కాపాడటంలో అద్భుత విజయం సాధించామని ప్రెసిడెంట్ చెప్పారు. పోలీసులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీంలు, శానిటేషన్ వర్కర్లు, డెలివరీస్టాఫ్, ట్రాన్స్ పోర్టేషన్, ర్టే రైల్వే, ఏవియేషన్ సిబ్బంది, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు నిస్వార్థ సేవలు అందించారని కొనియాడారు.

పేదలకు కేంద్రం అండ
కరోనా విపత్తుతో రోజువారీ కూలీలు, కార్మికులు తీవ్రంగా ప్రభావితం అయ్యారని ప్రెసిడెంట్ కోవింద్ అన్నారు. వీరిని ఆదుకునేందుకు కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం తెచ్చిందని, ఈ పథకంతో కోట్లాది మంది పేదలకు ఉపశమనం కలిగిందన్నారు. అగ్రికల్చర్ సెక్టార్ లోనూ కీలకమైన రిఫామ్స్ వచ్చాయన్నారు.

రామమందిరం గర్వకారణం..
అయోధ్యలో రామ జన్మభూమి వద్ద ఆలయ నిర్మాణం అందరికీ గర్వకారణమని ప్రెసిడెంట్ కోవింద్ అన్నారు. దేశ ప్రజలు సుదీర్ఘకాలం పాటు ఓపికతో, న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసంతో ఎదురు చూశారని, చివరకు రామ జన్మభూమి వివాదం జ్యుడీషియల్ ప్రాసెస్ ద్వారానే పరిష్కారమైందన్నారు.

For More News..

జ్యుడీషియరీపై ప్రశాంత్ భూషణ్ ట్వీట్స్ నేరమే

గల్వాన్‌ గొడవలో మా బాధ్యత లేదు