తమ జోలికొస్తే ఇరాన్‌ను అంతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాతో గొడవకు దిగితే.. అది ‘ఇరాన్‌కు అధికారిక అంతం’ అవుతుందన్నారు. అమెరికాను బెదిరించాలని ఇంకెప్పుడూ చూడొద్దని సోమవారం ట్వీట్ చేశారు. ఓవైపు ఇరాన్‌పై ట్రంప్ ఆంక్షలు విధించడం, మరోవైపు తమ అణు కార్యక్రమాలకు పరిమితులు విధించుకుంటామంటూ చేసుకున్న ఒప్పందాన్ని ఇకపై గౌరవించబోమని ఇరాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరాన్ బెదిరింపులతో ఓ క్యారియర్ స్ర్టైక్ గ్రూప్ (సీఎస్జీ), బీ–52 బాంబర్లను ట్రంప్ ఇటీవల గల్ఫ్ కు పంపారు. ఈ నేపథ్యంలోనే ట్వీట్లు చేశారు. దీనికి ఇరాన్ కూడా దీటుగా బదులిచ్చింది. ‘‘దురాక్రమణదారులందరూ వెళ్లిపోయారు. కానీ ఇరానియన్లు వేల ఏళ్లుగా ఇలానే నిలబడ్డారు. ఎకనామిక్ టెర్రరిజం, జాతి విధ్వంస వ్యాఖ్యలతో మీరు ఇరాన్‌ను అంతం చేయలేరు” అని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ మొహమ్మద్ జావద్ జరీఫ్ ట్వీట్ చేశారు. ‘‘ఇరానియన్ ను బెదిరించాలని చూడకు. వీలైతే గౌరవం ఇచ్చి చూడు. అది పని చేస్తుంది” అని కౌంటర్ ఇచ్చారు.
మా జోలికొస్తే ఖతం చేస్తం..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- విదేశం
- May 21, 2019
లేటెస్ట్
- అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
- టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల
- Nagababu: X(ట్విట్టర్) నుండి మెగా బ్రదర్ నాగబాబు అవుట్.. కారణం ఏంటంటే?
- ఆటగాడే : స్పీచ్ థెరపీతో ముగ్గులోకి దింపి.. మూడో పెళ్లి.. బాధితురాలి ఆందోళన
- Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్..అవతార్,అవెంజర్స్ నిపుణుల వీఎఫ్ఎక్స్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన