కర్నూలు జిల్లా ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్‌పురం గ్రామం వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మహిళలతోపాటు పలువురు చిన్నారులు కూడా మృతి చెందడం విషాదకరమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు.  గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన వారు కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ప్రమాదంలో మృతి చెందిన ఘటన పట్ల ప్రధాని మోడీ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. ఒకేసారి ఇంత మంది ప్రమాదంలో చనిపోవడం దిగ్ర్భ్రాంతికి గురిచేసిందన్నారు. చనిపోయిన వారి  కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ ప్రమాదం తనను కలచివేసిందంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

 

ఇవి కూడా చదవండి

విషాదం: టెంపో-లారీ ఢీ.. 14 మంది మృతి

దేశ చరిత్రలో సంజీవయ్యది చెరగని స్థానం

అసదుద్దీన్ ఒవైసీకి పిచ్చెక్కింది