హైదరాబాద్లో ప్రెస్టో ఇండియా.. లాండ్రీ స్టోర్లను ప్రారంభించిన స్పెయిన్ కంపెనీ

హైదరాబాద్లో ప్రెస్టో ఇండియా.. లాండ్రీ స్టోర్లను ప్రారంభించిన స్పెయిన్ కంపెనీ

హైదరాబాద్​, వెలుగు:  డ్రై క్లీనింగ్, లాండ్రీ సేవలు, యాక్సెసరీస్​ అందించే స్పెయిన్​ కంపెనీ ప్రెస్టో ఇండియా హైదరాబాద్​లో అడుగుపెట్టింది. బంజారా హిల్స్ హైటెక్ సిటీలలో కొత్తగా రెండు స్టోర్లను ప్రారంభించింది. పర్యావరణానికి అనుకూలంగా అత్యుత్తమ  సేవలను అందించడమే తమ లక్ష్యమని ప్రకటించింది. 

డ్రై క్లీనింగ్, లాండ్రీ, అల్టరేషన్ , షూ బ్యాగ్ రిపేర్ వంటి సేవలు అందిస్తుంది. ప్రెస్టో ఇండియా ఎండీ య్వో మెట్‌‌‌‌‌‌‌‌జెలార్ మాట్లాడుతూ... ప్రపంచ ప్రఖ్యాత ప్రెస్టో అనుభవాన్ని హైదరాబాద్ ప్రజలకు అందించడం ఆనందంగా ఉంది అన్నారు. 

దేశంలో ఇప్పటికే ముంబై, ఢిల్లీ ఎన్​సీఆర్​, బెంగళూరు ప్రాంతాల్లో 50కి పైగా స్టోర్లను ప్రెస్టో నడుపుతోందని వివరించారు.