కార్తీక మాసం పూర్తయ్యింది.. చికెన్ రేట్లు పెరిగాయి.. కోడి గుడ్డు అయితే గుడ్లు తేలేయటమే !

కార్తీక మాసం పూర్తయ్యింది.. చికెన్ రేట్లు పెరిగాయి.. కోడి గుడ్డు అయితే గుడ్లు తేలేయటమే !

ఏంటి సామీ మరీనూ.. ఏంటీ ధరలు.. డబ్బున్నోడికి లెక్కలేకపోవచ్చు.. మధ్య తరగతివాడు మాత్రం పూట గడవాలంటే గుడ్లు తేలేసే రోజులు వచ్చాయి. కార్తీకమాసం అలా పూర్తయ్యిందో లేదో.. అప్పుడే చికెన్, కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. కార్తీకమాసంలో వెళ్లిపోవడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. కిలో చికెన్ దాదాపు 250 రూపాయలు పలుకుతుంది. నవంబర్ నెలాఖరుకు 280 రూపాయల వరకూ పెరిగే అవకాశం ఉంది. ఇక కోడిగుడ్డు అయితే అమ్మో అమ్మో అని గుండెలు బాగుకోవటమే. ఒక్క కోడి గుడ్డు 7 రూపాయలు.. ఏంటీ అవాక్కయ్యారా.. అవునండీ ఒకే ఒక్క కోడిగుడ్డు అక్షరాల ఏడు రూపాయలకు చేరింది.

డజను కోడిగుడ్లు తీసుకుంటే 84 రూపాయలు.. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే.. డజను గుడ్లు మూడు రోజుల్లో ఖతం. కూరగాయల ధరలు అధికంగా ఉన్నప్పుడు కోడిగుడ్లతో సరిపెట్టుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు.. ఇప్పుడు కోడిగుడ్లు కూడా భారం అయ్యాయి. కూరగాయలతో పోటీపడి మరీ కోడిగుడ్ల ధర అమాంతం పెరగటం చూస్తుంటే.. జస్ట్ మరో నెల.. రెండు నెలల్లో డజను సెంచరీ.. అదేనండీ వంద రూపాయలు కావటం ఖాయంగా కనిపిస్తుంది.

కోడి గుడ్డు ధరలు కొండెక్కాయి. బహిరంగ మార్కెట్‌‌లో గత కొన్ని రోజులుగా ఎగ్స్ రేట్ క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కార్తీక మాసం ఎఫెక్ట్ కారణంగా మాంసాహారానికి చాలా మంది దూరంగా ఉన్నారు. కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం మొదలుకావడంతో కోడి గుడ్డు ధర పెరిగింది. 

ఒక్కో ఎగ్​ ధర హోల్‌‌‌‌సేల్‌‌‌‌గా రూ.6.35 ఉండగా.. రిటెయిల్గా  రూ.7 , రూ.7.50 నుంచి రూ. 8 వరకు ధర పలుకుతున్నది. చలికాలంలో ఎగ్స్ ధరలు పెరగడం సాధారణమేనని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. కానీ గత కొన్నేండ్లుగా ఇంత పెద్ద ఎత్తున పెరగలేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరో వారం పది రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి.

గుడ్డు పౌష్టికాహారమని, రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుండడంతో వీటి వినియోగం పెరిగింది. కోడిగుడ్డును ప్రజలు తమ రోజువారీ మెనూలో ఆహారంగా తీసుకుంటున్నారు. చాలామంది రోజూ తప్పనిసరిగా గుడ్డు తింటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే రోజుకు కోటి కోడి గుడ్లకు పైగా వినియోగం అవుతున్నాయంటే పబ్లిక్ ఎగ్స్ ను ఏ రేంజ్ లో తింటున్నారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ మొత్తం రోజుకు వినియోగించే గుడ్ల సంఖ్య 3 కోట్ల  మేర ఉంటుందని అధికారులు అంచనా. అయితే దేశంలో రోజుకు 30 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లకు పైగానే ఎగ్స్​ప్రొడక్షన్ ఉండడం విశేషం.