బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఈ సీజన్ ముగియనుంది. దీంతో హౌస్ లో ఉత్కంఠ, ఆసక్తి రెట్టింపయ్యాయి. ఈ కీలకమైన 11వ వారం .. ఫ్యామిలీ వీక్ సందడితో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ప్రేక్షకులను భావాద్వేగాలతో ముంచెత్తారు.. వరుసగా ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇస్తుండటంతో ఇంటిలో వాతావరణం మొత్తం సెంటిమెంట్ కు కేరాఫ్ గా మారింది.
ఫ్యామిలీ వీక్ హైలైట్స్
ఈ వారం తనూజ, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి, భరణి శంకర్, దివ్య నిఖితా, డిమాన్ పవన్, రీతూ చౌదరి, సంజన గల్రానీ వంటి దాదాపు అందరి కుటుంబ సభ్యులు వచ్చి హౌస్‌మేట్స్‌కు మద్దతు ఇచ్చారు. కళ్యాణ్ తల్లి లక్ష్మి వచ్చి తన కొడుకును విన్నర్ కావాలని ప్రామిస్ తీసుకుంది. మరో వైపు భరణి కూతురు హారతి వచ్చి తండ్రి ఆటతీరుపై కొన్ని కీలక సలహాలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. దివ్య తల్లి, రీతూ తల్లి తమ పిల్లల గేమ్ గురించి మాట్లాడి హౌస్ డైనమిక్స్‌ని మార్చేశారు. ఈ క్రమంలోనే రీతూ చౌదరి తల్లి ఆమెకు డీమాన్ పవన్ విషయంలో పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం హైలైట్‌గా నిలిచింది.
ఇమ్మూ తల్లితో ఎమోషనల్ పీక్!
ఫ్యామిలీ వీక్ ముగింపు దశలో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తల్లి హౌస్‌లోకి అడుగుపెట్టారు. కొడుకును చూడగానే ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టి ఆశీర్వదించారు. తాను కొనిచ్చిన బంగారు గాజులు తల్లి ధరించి ఉండటం చూసి తర్వాత ఇమ్మూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏ బంగారాన్ని వద్దనుకున్నానో.. ఆ బంగారం రెండు రాష్ట్రాల్లో నాకు పేరు తెస్తున్నాడు అని తల్లి భావోద్వేగానికి లోనైంది. దీంతో ఇమ్మూ కన్నీళ్లు పెట్టుకున్నారు.. వెంటనే తేరుకుని తల్లి ఏడవద్దు డాడీ.. కమెడియన్‌గా వచ్చావ్.. హీరోగా బయటకు రావాలి అంటూ కొడుకుకు ధైర్యం చెప్పి దీవించింది.
ఇమ్మూ తల్లి కేవలం సెంటిమెంట్‌కే పరిమితం కాకుండా, కొడుక్కి ఏమాత్రం తీసిపోదన్నట్లుగా తనదైన శైలి కామెడీతో హౌస్‌మేట్స్‌తో సరదాగా గడిపింది. చివర్ లో ఇమ్మూ పాట పాడి అందరి మనసులను కదిలించాడు. అంతేకాకుండా, ఇమ్మూ తల్లి అతడికి ఎంగేజ్‌మెంట్ రింగ్ తీసుకొచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈ వార్త ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
కొత్త కెప్టెన్ రీతూ చౌదరి!
మరోవైపు.. హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠభరితంగా జరగ్గా.. రీతూ చౌదరి కొత్త కెప్టెన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇది రీతూకి చాలా ముఖ్యమైన విజయం. ఎందుకంటే 11వ వారం నామినేషన్లలో అత్యధిక ఓట్లు పడినా, కెప్టెన్సీ పవర్‌తో తనూజ ఆమెను సేవ్ చేసింది. ఈ కెప్టెన్సీతో ఆమె తదుపరి వారం కూడా నామినేషన్స్ నుంచి సేఫ్‌గా ఉండనుంది.
ప్రస్తుతం కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్ ఓటింగ్ ట్రెండ్స్‌లో టాప్-3 స్థానాల్లో కొనసాగుతూ సేఫ్‌గా ఉన్నట్లు సమాచారం. చివరి స్థానాల్లో ఉన్న దివ్య నిఖితా, సంజన గల్రానీ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఫ్యామిలీ వీక్ ఇచ్చిన ఎనర్జీతో కంటెస్టెంట్లు చివరి అంకంలో గేమ్ మరింత రసవత్తరంగా మారుస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
