The RajaSaab: ప్రభాస్ పాటల నగరా మొదలైంది.. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్

The RajaSaab: ప్రభాస్ పాటల నగరా మొదలైంది.. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ముందొచ్చేది ‘ది రాజా సాబ్’ (The Raja Saab). మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఊరిస్తూ వస్తోంది. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో హైప్ మరింత ఎక్కువగా ఉంది. ఈ సినిమా పొంగల్ కానుకగా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్కి సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్తో సన్నాహాలు షురూ చేశారు. 

ఇవాళ శుక్రవారం (నవంబర్ 21న) ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. మరో రెండ్రోజుల్లో ఆదివారం (నవంబర్ 23న) సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన లుక్.. స్పెషల్ వైబ్ క్రియేట్ చేస్తోంది.ప్రభాస్ స్టైలిష్ లుక్లో కనువిందు చేస్తున్నారు. రంగురంగులగా అలంకరించిన పండుగలాంటి ఓ వేడుకలో ప్రభాస్ దర్శనం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అభిమానులు రాజాసాబ్ని స్వాగతిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఓవరాల్గా పోస్టర్ చూస్తుంటే.. ‘రెబల్ స్టైల్, రెబల్ స్వాగ్.. రెబల్ మ్యాడ్నెస్’ చూడబోతున్నట్లుగా అర్ధమవుతుంది. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎలాంటి కిక్ ఇవ్వనుందో తెలియాలంటే.. ఇంకో రెండు రోజులు వెయిట్ చేయక తప్పదు.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ విజువల్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో రానున్న ఫస్ట్ సింగిల్తో మూవీపై మరింత క్యూరియాసిటీ పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే.. ఈ క్రేజీ హార్రర్ కామెడీ మూవీలో ప్రభాస్కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీల‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.