వీడియో వైరల్: బంపర్ పోతేపోయింది.. అదే ఎలుక లోపలికి దూరి ఉంటే వైర్లు మొత్తం కట్ చేసేది.. 30 వేలు బొక్క

వీడియో వైరల్: బంపర్ పోతేపోయింది.. అదే ఎలుక లోపలికి దూరి ఉంటే వైర్లు మొత్తం కట్ చేసేది.. 30 వేలు బొక్క

కోటి విద్యలు కూటి కొరకే.. ఇది మనుషులకే కాదండోయ్​.. మూగ జీవాలకు వర్తిస్తుందని.. ఇక్కడ విద్య అంటే ఆలోచన.. తెలివితేటలు అనుకోవాలి.   పార్కింగ్​ చేసిన కారులో ఎలుక దూరిన విషయాన్ని కుక్క పసిగట్టింది.  అసలే కారు ఆగి ఉంది.  ఇంకే ముంది.. ఎలుకను తింటానికి కుక్క చాలా కష్ట  పడింది.  ఆ ఎలుక తప్పించుకుందో..కుక్కకు ఆహారం అయిందో లేదో తెలియదుకాని.. ఆ కారు ఓనర్​ జేబుకు మాత్రం చిల్లి పడింది.  అదేంటనుకుంటున్నారా.. 

కుక్క కారు బంపర్​ను నోటితో లాగేసింది.  ఒక కుక్క, ఎలుకను పట్టుకునే ప్రయత్నంలో మారుతీ సుజుకీ XL6కారు బంపర్​ ను  నోటితో సులభంగా పీకేసిన వీడియో వైరల్​ గా  మారింది. ఈ ఘటన సుజుకీ కార్ల నాణ్యత  ఎంత నాసిరకంగా ఉందో చూపిస్తుందని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంత తేలికగా బంపర్ ఊడిపోవడం, వినియోగదారుల భద్రత పట్ల కంపెనీ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని విమర్శిస్తున్నారు. ఈ వీడియో వాహన తయారీ ప్రమాణాలపై అనుమానాలను పెంచింది. ప్రస్తుతం కుక్క పీకి పీలికలు చేస్తున్న కారు వీడియో  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

సిటీల్లో ఇండ్లముందు .. షాపింగ్​కు.. సినిమాలకు వెళ్లినప్పుడు.. పార్కింగ్​ ప్లేస్​ల్లో ..లేదా ఏదైనా టూర్​ కు కార్లలో వెళ్లినప్పుడు రోడ్డు పక్కన పార్కింగ్​ చేస్తాం.. కొద్దిసేపటికే బారెడు చాకిరి ఎందుకని కవర్​ కప్పం.. అలా చేసిన పార్కింగ్​ చేసిన కారును కుక్క పీకేసింది. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది.  మరి మీరు కారు పార్కింగ్​ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి..!