
దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు పెరిగాయి. గత నెలలో మొబైల్ ఫోన్లపై పన్నులను 12శాతం నుంచి 18 శాతానికి పెంచుతున్నట్లు వస్తుసేవల పన్ను (GST) ప్రకటించింది. దీంతో దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు పెంచుతున్నట్లు ప్రముఖ మొబైల్ సంస్థలు ప్రకటించాయి. ప్రస్తుతం వస్తున్న కొత్త రకంపైనే కాకుండా పాత రకం ఫోన్ల ధరలు కూడా పెంచేశాయి. యాపిల్ ఫోన్లపై కూడా 5 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.