
ఎంతో పరమ పవిత్రంగా పూజలు అందుకునే నీలకంటేశ్వర ఆలయంలో మద్యం సేవిస్తూ మహాశివునికి పూజలు చేస్తుండు ఓ పూజారి. పాన్ పరాక్, గుట్కాలు, ఆలయ గర్భ గుడిలో దాచి పెట్టిన మద్యం సీసాలు దేవాదాయశాఖ అధికారుల తనిఖీల్లో బయటపడడం కలకలం రేపుతోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది.
జిల్లా మణుగూరులోని పురాతన కాకతీయుల కాలం నాటి శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా విరజిల్లుతోంది.ఎంతో పవిత్రంగా ఉండి ఆ మహాశివునికి పూజలు చేసే ఆలయ ప్రధాన అర్చకుడు పై దేవాదాయశాఖ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు ఆలయానికి వచ్చిన అధికారులు విస్తు పోయారు. సాక్షాత్తు స్వామివారి గర్భగుడిలోనే మద్యం సీసాలు దర్శనమివ్వడంతో ఖంగుతున్నారు. ఆలయంలోనే మద్యం సీసాలు,గుట్కా ప్యాకెట్లు చూసి అవాక్కయ్యారు.
మద్యం సేవిస్తూ స్వామివారికి అభిషేకాలు, నిత్యం పూజలు చేసే అర్చకులు ఇలాంటి పనులు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు మార్లు అధికారులు హెచ్చరించినా పూజారి తీరు మారకపోవడంతో అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు.