ఏపీలో ఫిబ్రవరి 1నుంచి ప్రైమరీ స్కూళ్లు ఓపెన్

ఏపీలో ఫిబ్రవరి 1నుంచి ప్రైమరీ స్కూళ్లు ఓపెన్
  • మార్గదర్శకాలు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలన్నీ ఇక గాడిలో పడినట్లే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రైమరీ స్కూళ్ల రీఓపెన్ తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లన్నీ ఓపెన్ చేయాలని ఆదేశించింది. కరోనా నిబంధనల మేరకు.. సోషల్ డిస్టెన్స్.. మాస్కులు.. విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకార పత్రాలను తీసుకోవాలని సూచించింది. కరోనా లాక్డ్‌న్ కారణంగా ఈ విద్యా సంవత్సరం నెలకొన్న అనుమానాలు, అపోహలు, ఊహాగానాలకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పాటించాల్సిన మార్గదర్శకాలు

2020-21 విద్యా సంవత్సరానికి  01.02.2021 నుండి 1 నుండి  – 5 తరగతులన్నీ  ప్రారంభం అవుతాయి.

  • ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3.45 వరకు ప్రతిరోజూ పూర్తి రోజు పనిచేస్తాయి. విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావచ్చు. అయితే భౌతికంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వ్రాతపూర్వక అనుమతితో మాత్రమే.
  • పిల్లలందరికీ, బోధన మరియు బోధనేతర సిబ్బంది మొహానికి మాస్కులు ( ముసుగులు) ధరించడం తప్పనిసరి.
  • తరచుగా చేతులు కడుక్కోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్19 నిబంధనలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
  • సోషల్ డిస్టెన్స్ ( సామాజిక దూరం) తప్పనిసరిగా ఉండాలి.

ఈ విషయంలో, ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి:

ROLL : 0-20   ప్రతి రోజు (క్లాస్ I-V)

ROLL :21-40 ఒక పాఠశాలలో రెండు తరగతి గదులు ఉంటే ప్రతిరోజూ తరగతులు నడుస్తాయి (క్లాస్ I- V)

ROLL : 41-60  ఒక పాఠశాలలో మూడు తరగతి గదులు ఉంటే, తరగతులు ప్రతిరోజూ (క్లాస్ I-V) నడుస్తాయి, కాకపోతే ప్రత్యామ్నాయ రోజు (క్లాస్ I, III,V – వన్ డే &  క్లాస్ II & IV – ప్రత్యామ్నాయ రోజు)

ROLL : 61-80: ఒక పాఠశాలలో నాలుగు తరగతి గదులు ఉంటే, ప్రతిరోజూ తరగతులు నడుస్తాయి, లేకపోతే ప్రత్యామ్నాయ రోజు (క్లాస్ I, III, V – వన్ డే & క్లాస్ II & IV – ప్రత్యామ్నాయ రోజు

ROLL :81-100 ఒక పాఠశాలలో ఐదు తరగతి గదులు ఉంటే, ప్రతిరోజూ తరగతులు నడుస్తాయి, లేకపోతే ప్రత్యామ్నాయ రోజు (క్లాస్ I, III, V – వన్ డే & క్లాస్ II & IV ప్రత్యామ్నాయ రోజు

ROLL :100 పైన ప్రత్యామ్నాయ రోజులు (క్లాస్ I,  III, V – వన్ డే & క్లాస్ II & IV – ప్రత్యామ్నాయ రోజు).