నేతాజీకి ప్రధాని, రాష్ట్రపతి నివాళి

నేతాజీకి ప్రధాని, రాష్ట్రపతి నివాళి

ఈ రోజు పరాక్రమ్ దివస్ (నేతాజీ జయంతి) సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. భారతదేశ చరిత్రకు నేతాజీ చేసిన అసమానమైన కృషిని మోడీ గుర్తు చేసుకుంటున్నాన్నారు. వలస పాలనకు తీవ్రంగా ప్రతిఘటించిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని కొనియాడారు. అతని ఆలోచనలకు తాము ప్రభావితమయ్యామని తెలిపారు. ఆయన కలలను సాకారం చేయడానికి తాము కృషి చేస్తున్నామని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.

పరాక్రమ్ దివస్ సందర్భంగా భారతమాత ముద్దు బిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పిస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. నేతాజీ ఎనలేని ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో లక్షలాది మంది దేశప్రజలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. ఆయనకు దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు.