ఏషియన్ సినిమాస్ అధినేత, నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. నాగార్జున ఫ్యామిలీ, చిరంజీవి, వెంకటేష్, సందీప్ రెడ్డి వంగా, సమంత, రవితేజతో పాటు తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
అయితే ఈ వేడుకలో మాజీ దంపతులు సమంత, నాగ చైతన్య ఒకే వేదికపై కనిపించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. 2021లో విడిపోయిన తర్వాత వీరిద్దరూ ఒకే ఈవెంట్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడంతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Surreal 🥶📈❤️🔥@Samanthaprabhu2 !! #Samantha#SamanthaRuthprabhu pic.twitter.com/xGGCIrs6jo
— 𝐓𝐍 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚 𝐅𝐚𝐧𝐬 (@TN_SamanthaFans) May 2, 2026
ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ జీవిత భాగస్వాములతో కలిసి వేడుకకు హాజరయ్యారు. సమంత ఊదా రంగు చీరలో మెరిసిపోగా, ఆమె భర్త రాజ్ నిడిమోరు స్టైలిష్ లుక్‌లో కనిపించారు. మరోవైపు నాగ చైతన్య తన భార్య శోభిత ధూళిపాళ్లతో పాటు తండ్రి నాగార్జున, తల్లి అమలతో కలిసి హాజరయ్యారు. శోభిత నీలం-గులాబీ రంగు చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదికపై నూతన దంపతులను ఆశీర్వదించే సమయంలో చై-శోభిత జంటతో పాటు సమంత-రాజ్ జంట కూడా కెమెరాకు కనిపించడంతో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
King @iamnagarjuna and Yuvasamrat @chay_akkineni, accompanied by their family, graced @AsianSuniel’s daughter Simran’s wedding reception.@amalaakkineni1 @sobhitaD pic.twitter.com/8jSqxkZvmF
— Vamsi Kaka (@vamsikaka) May 2, 2026
ఇక సునీల్ నారంగ్కి నాగార్జునతో మంచి అనుబంధం ఉంది. నాగ చైతన్యతో లవ్ స్టోరీ, నాగార్జునతో కుబేర వంటి చిత్రాలు నిర్మించి విజయాలు అందుకున్నారు. అదే విధంగా సమంత భర్త రాజ్ కూడా నిర్మాత కావడంతో నారంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబం, సమంత దంపతులు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Chay and Sam attended the same event yesterday?Imma screaminggggg pic.twitter.com/b7i3OTwt2M
— Aryan (@Pokeamole_) May 3, 2026
