పాపం.. ఎంత కష్టమొచ్చిందో ఏమో..! రైలు కింద పడి చనిపోయాడు... చేతిమీద పల్లవి అని ట్యాటూ ఉంది..!

పాపం.. ఎంత కష్టమొచ్చిందో ఏమో..! రైలు కింద పడి చనిపోయాడు... చేతిమీద పల్లవి అని ట్యాటూ ఉంది..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గుర్తు తెలియని వ్యక్తి. ఆదివారం ( మే 3 ) ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ మీదకు వస్తుండగా..ఒక గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు అతని శరీరంపై నుండి వెళ్లడంతో శరీరం రెండు భాగాలుగా తెగిపోయి అక్కడికక్కడే మరణించాడు.

మృతుడి కుడిచేతిపై పల్లవి అనే ట్యాటూ మినహా... అతడి గురించి ఎలాంటి వివరాలు లభించలేదని తెలిపారు పోలీసులు. మృతుడు 5.6 అంగుళాలు ఎత్తు ఉండి, ఆకుపచ్చ రంగుపై తెలుపు చెక్స్ గల ఫుల్ హాండ్స్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మృతుడి ఆచూకీ తెలిసినవారు సికింద్రాబాద్ GRP ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ 8712658581 లేదా దర్యాప్తు అధికారి ఫోన్ నెంబర్ 9666280808 కి గానీ సమాచారం అందించాలని కోరారు పోలీసులు.