కష్టాల్లో సాయి పల్లవి మూవీ.. మొదటి రోజు జస్ట్ కోటికి పైగా.. రెండో రోజైతే అంతకంటే తక్కువ!

కష్టాల్లో సాయి పల్లవి మూవీ.. మొదటి రోజు జస్ట్ కోటికి పైగా.. రెండో రోజైతే అంతకంటే తక్కువ!

సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ 'ఏక్ దిన్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది. మే 1, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లభించట్లేదు. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వడంలో విఫలమైంది. దాంతో కలెక్షన్లు కూడా నిరాశపరుస్తున్నాయి.

మొదటి రోజు (శుక్రవారం) దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.1.37 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. రెండో రోజు (శనివారం) కలెక్షన్లు ఇంకా పడిపోయి కేవలం రూ.1 కోటి నెట్ మాత్రమే రాబట్టింది. ఇలా రెండు రోజుల్లో కలిపి ఏక్ దిన్ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.2.15 కోట్ల నెట్, రూ.2.57 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ దిశగా సాగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ‘ఏక్ దిన్’ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. రెండో రోజు ఈ చిత్రం ఓవర్సీస్‌లో కేవలం రూ.15 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీంతో మొత్తం విదేశీ మార్కెట్లలో ఈ సినిమా వసూళ్లు ఇప్పటివరకు రూ.25 లక్షలకు చేరుకున్నాయి. ఇలా దేశీయ మరియు అంతర్జాతీయ కలెక్షన్లు కలిపి చూస్తే, ‘ఏక్ దిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.2.82 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ప్రస్తుతం ఈ వసూళ్లు చిత్రానికి భారీ నష్టాలను ఇచ్చేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కథేంటంటే: ఇందులో జునైద్ లో లోపల సిగ్గుపడే రోహన్ అనే యువకుడిగా, సాయి పల్లవి ఉల్లాసంగా ఉండే అమ్మాయిగా మీరా పాత్రలో నటిస్తుంది. మీరాను ఇష్టపడే రోహన్.. ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం భయపడుతుంటాడు. జీవితంలో ఒక్క రోజైనా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని కలలు కంటాడు. మరి రోహన్ ప్రేమలో ఎలాంటి పరిణామాలు చోటు చోసుకున్నాయనేది మెయిన్ స్టోరీ.

'రాజా శివాజీ':

మరోవైపు, జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ నటించిన 'రాజా శివాజీ' మెరుగైన వసూళ్లను సాధిస్తుంది. రెండు రోజుల్లో భారతదేశంలో రూ. 21.90 కోట్ల నెట్ వసుళ్లు సాధించింది. ఒక్క మరాఠీ వెర్షన్ వసూళ్లే ఈ చిత్రాన్ని రూ.15.15 కోట్ల మార్కు అందుకుంది. ప్రస్తుతం ఉన్న టాక్ కి ఈ మూవీ మరిన్ని వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.