బ్రెసీలియా చేరుకున్న ప్రధాని మోదీ

బ్రెసీలియా చేరుకున్న ప్రధాని మోదీ

బ్రెసీలియా: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (జులై 09)  బ్రెజిల్‌ రాజధాని బ్రెజిలియా చేరుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఆహ్వానం మేరకు బ్రిక్స్ సదస్సు ముగిసిన తర్వాత మోదీ బ్రెసీలియాలో అడుగుపెట్టారు. 

అక్కడ ఆయనకు భారతీయ, బ్రెజిలియన్ సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం లభించింది. శివ తాండవ స్తోత్రంతో పాటు బ్రెజిలియన్ సాంబా రెగె నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలను చూసిన ప్రధాని.. కళాకారులను అభినందించారు. 

తనకు లభించిన ఘన స్వాగతంపై మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. "కొద్దిసేపటి క్రితం బ్రెసీలియాలో ల్యాండ్ అయ్యాను.  ప్రవాస భారతీయులు చేసిన ఘన స్వాగతం మరపురానిది. ఈ స్వాగతం  భారత్, ​-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది" అని మోదీ పేర్కొన్నారు.