కోవిడ్ ముప్పు ఇంకా పోలె

కోవిడ్ ముప్పు ఇంకా పోలె

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై పన్నులను తగ్గించాలని ప్రధాని మోడీ సూచించారు. ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వర్చువల్ గా సమావేశామయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాన్యులపై పెట్రో భారం ఎక్కువగా ఉందన్న ప్రధాని... గత నవంబర్ లో కేంద్రం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించి ప్రజలపై పెట్రో భారం పడకుండా చూడాలని కోరారు. తెలంగాణ, ఏపీ, మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, జార్ఖండ్, తమిళనాడు ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని కోరారు. కరోనా వ్యాక్సినేషన్ లో భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. వయోజన జనాభాలో 96 శాతం మంది మొదటి డోస్, 15 ఏళ్లు పైబడిన వారిలో 85 శాతం మంది సెకండ్ డోస్ వేయించుకున్నారన్నారు. ఇది ప్రతి ఒక్కరికి గర్వకారణమన్నారు. చిన్నారులకు కోవిడ్ టీకా అందిచాలని, దీనికి పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని మోడీ సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కోవిడ్ సంక్షోభాన్ని మెరుగ్గా ఎదుర్కొన్నప్పటికీ... రాష్ట్రాల నిర్లక్ష్యంతో కోవిడ్ కేసులు మళ్లీ పెరుతున్నాయన్నారు. కోవిడ్ ముప్పు ఇంకా తగ్గలేదని, ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం...

ఏ వర్గానికి బీజేపీ మేలు చేయలేదు

నేనడిగే 21 ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి